నేను చదివిన పామర్రు మండల చరిత్ర పుస్తకం ప్రకారం పూర్వం ఈ గ్రామంలో కొండిపర్తి వంశస్తులతో అంటే ౩ శతాబ్దాల క్రిందట బ్రాహ్మణులూ దీనిని అగ్రహారంగా ఏర్పాటు చేసుకున్నారు అందువల్ల ఈ గ్రామని కొండిపర్రుగా పిలవబడింది.
కౌండిన్య శాస్త్రి అనే పండితుడు తన పరివారంతో ఈ గ్రామంలో తొలత నివశిస్తూ కౌండిన్యపురిగా ఏర్పాటుకు దోహదపడినట్లు తెలుస్తోంది .
స్వాతంత్ర్య సమరంలో మార్తి రామయ్య పాల్గొని ప్రసిద్ది గాంచారు.
హరికధా పితామహులు పొడుగు పండురంగాదాసు గజారోహణం, గండపిండేరంతో సత్కరింపబడి జాతీయ స్థాయలో గుర్తింపు పొందారు.
1850 లో కాశీ నుంచి తీసుకువచ్చి శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి శివలింగ ప్రతిష్ట గావించారు.ఈ గ్రామంలో పూర్వం వెంకటరామ సిద్దశ్రమం వుండేది.అక్కడ ఆయుర్వేద వైద్యం,యోగ గురూజీ నిర్వహిoచేవారు.సినీ ,నాటక, రంగస్థల సంగీత దర్శకుడుగా మార్తి సీతారామయ్య మృదంగ ఘనపతిగా నమ్మగడ్డ పరదేశి ఈ గ్రామానికి చెందినవారే.పోలీసు శాఖలో జి.తిలక్ ప్రముఖ అధికారిగా వున్నారు. సూర్యనారాయణ బొమ్మల తయారీలో ప్రసిద్ది గాంచారు.గ్రామానికి సమీపంలోని వీరాంజనేయ పురానికి చెందిన ఆరేపల్లి నాగ రాజు సిద్దాంతి నేతృత్వంలో శ్రీ గణపతి లక్ష్మి సరస్వతి మూర్తుల ఎకపీట దేవాలయం 12 -2 -2001న శంఖుస్తాపన జరిగి 7-4-2003 న ప్రారంభోత్సవం జరిపారు.
సినీ , రంగస్థల , TV నటిడైన సాక్షి రంగారావు గారు కూడా ఈ గ్రామానికి చెందినవారే.1927 లో బాపట్లకు చెందిన భైరవపట్ల వంశీయలు అంజనేయ పరమహంస అనే అవధూతచే మామిడితోటలో ఆంజనేయస్వామిని ప్రతిష్టి౦చారు. వారి శిష్యులు మధుసూదనరావు గారు 1977 లో గుడి కట్టించారు. అనoతరం 1986 లో ఆరేపల్లి నాగరాజు గుడి పున:నిర్మాణం చేపట్టి మామిడితోటలో మారుతీ భాక్తులుకు నేలవుగా ఆలయాన్ని తీర్చిదిద్దారు.గాంధేయవాది యలమంచిలి వెంకటేశ్వర రావు కృషి ఫలితంగా విద్యవనం పబ్లిక్ ట్రస్టు అనే హిందీ పాఠశాలా,గ్రామీణ కుటీర పరిశ్రమల సంస్థ ఏర్పడింది.ప్రస్తుతం ఇప్పుడు పుట్టకొక్కుల కేంద్రంగావుంది.
ఈ గ్రామానికి చెందిన మార్తి గంగాధరశాస్త్రి,ఉప్పలపాటి సత్యనారాయణ, సింగవరపు వీరభద్రయ్య గార్ల సహకారంతో 1947 జూలై 14 వ తేదిన విద్యవనం నిర్మాణానికి యలమంచిలి వెంకటేశ్వరరావు గారు శ్రీకారం చుట్టి దినదిన ప్రవర్ధమానం చేసి జాతీయోద్యమానికి కృషి చెశారు.ఈ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బొమ్మారెడ్డి కోటిరెడ్డి సమీప బంధువు గుజవర్తి శ్రీరామకృష్ణారెడ్డి (USA )వితరనత్వంతో గ్రామంలో 7వ తరగతి అత్యుత్తమ విద్యార్ధులకు శాశ్వతంగా ఉపకారవేతనం ఇచ్చి పామర్రు హైస్కూల్ నిర్మాణానికి భూరి విరాళాలు ఇచ్చి పేరు గాంచారు .
కౌండిన్య శాస్త్రి అనే పండితుడు తన పరివారంతో ఈ గ్రామంలో తొలత నివశిస్తూ కౌండిన్యపురిగా ఏర్పాటుకు దోహదపడినట్లు తెలుస్తోంది .
కాపీరైట్ © 2019 కొండిపర్రు. అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. | రూపకల్పన చేసిన వారు రామాంజనేయులు జుజ్జవరపు